ఎల్లో మీడియా తప్పుడు వార్తలు

31 Mar, 2020 03:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రేషన్‌ క్యూలో మహిళ మృతి అంటూ ప్రచారం

అనారోగ్యంతో మరణించిందని జేసీ స్పష్టీకరణ

చోడవరం/ చోడవరం టౌన్‌/గుడివాడ : వృద్ధురాలి సహజ మరణానికి కూడా రాజకీయ రంగు పులిమి ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నాయకులు ప్రచారం చేయడంపై స్థానికుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. విశాఖ జిల్లా చోడవరం పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన షేక్‌ మీరాబీ (68) అనే వృద్ధురాలు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో రేషన్‌ దుకాణానికి వెళుతూ మార్గం మధ్యలో స్పృహ తప్పి పడిపోయిందని, ఇంటికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మీరాబీ రేషన్‌ షాపు వద్ద లైన్‌లో నిలబడటం వల్లే చనిపోయిందనే ప్రచారం చేస్తున్నారని, ఇది అవాస్తవమని జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు.

ఆమె అసలు రేషన్‌ దుకాణానికే చేరుకోలేదన్నారు. మధ్యలోనే కుప్పకూలిపోయిందని, మణికంఠ అనే గ్రామ వలంటీర్‌ ఆమె ముఖంపై నీరు చల్లితే లేచి కూర్చుందన్నారు. ఆమె మనవడు ఇంటికి తీసుకువెళుతుండగా మృతి చెందిందని చెప్పారు. అయితే ఓ వర్గం మీడియా అసత్య ప్రచారం చేసిందన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆర్డీవో, తహసీల్దార్‌లను ఆదేశించినట్టు తెలిపారు.

అసత్య ప్రచారంపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం
విశాఖ జిల్లాలో షేక్‌ మీరాబి అనే వృద్ధురాలు రేషన్‌ సరుకుల కోసం ఎండలో క్యూలో నిలబడి మృతి చెందినట్లు జరుగుతున్న ప్రచారంపై  రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు