ప్రభుత్వ విద్యలో యోగా

11 Dec, 2018 07:28 IST|Sakshi

శ్రీకాకుళం :యోగా విద్యను ప్రభుత్వ విద్యలో ప్రవేశపెట్టాలి. నేను ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో యోగా విద్యలో పీజీ డిప్లమా చేశాను. నా వంటి వారు వేలల్లో ఉన్నారు. ప్రభుత్వ విద్యలో యోగా ప్రవేశపెడితే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ విధానం అమల్లోకి తీసుకురావాలన్నా..– పొన్నాడ మాధురి, గట్టుముడిపేట

అన్నీ సమస్యలే
మేమంతా గీత కార్మికులుగా జీవిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందడం లేదు. బీసీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయడం లేదు. ఆదరణ పథకం ద్వారా  పనిముట్లు కూడా అందజేయలేదు. ప్రభుత్వం నుంచి  ఇళ్లు మంజూరు చేయడం లేదు. అధికార పార్టీకి చెందిన వారికే ఇళ్లు అందజేస్తున్నారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నా..
–  కొలిసి పార్వతి, గూడెం యాతలవీధి, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు