యోగాతో ఆరోగ్యంగా ఉండండి: ఏపీ గవర్నర్‌

20 Jun, 2020 10:56 IST|Sakshi

రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం

సాక్షి, విజయవాడ: యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్ (సివైపి)ను అనుసరించి ఈ నెల 21న (ఆదివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవంలో  పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్‌ శనివారమిక్కడ మాట్లాడుతూ యోగా మన దేశంలో ఐదువేల సంవత్సరాల క్రితమే ఉద్భవించిన పురాతన సాంప్రదాయమన్నారు. (రేపొక్క రోజే ఏడు రోజులు)

యోగా కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచడానికి సాయం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచనతో ఐరాస జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించిందన్నారు. కరోనా బారిన పడకుండా ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21, 2015న మొదటి అంతర్జాతీయ యోగా డేను నిర్వహించారు. (ఇంట్లోనే యోగా చేయండి!)

మరిన్ని వార్తలు