విభజన నిర్ణయంపై నవ దంపతుల నిరసన

13 Dec, 2013 00:53 IST|Sakshi
విభజన నిర్ణయంపై నవ దంపతుల నిరసన

తణుకు అర్బన్, న్యూస్‌లైన్ : వాళ్లిద్దరూ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో.. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యూరు. బంధుమిత్రులతో కలసి సొంతూరికి పయనమయ్యూరు. విభజన నిర్ణయూనికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపును అందుకుని తణుకులో చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదంటూ నవదంపతులిద్దరూ అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు. ‘జై సమైక్యాంధ్ర’ అని నినదించారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా గాజుల్లంక గ్రామానికి చెందిన సనక గోవిందరాజు, మణిలకు తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో బుధవారం రాత్రి వివాహమైంది.

 గురువారం తణుకు మీదుగా తమ ఊరికి బయలుదేరారు. తేతలి వై జంక్షన్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించడంతో వారు ప్రయాణిస్తున్న కారు నిలిచిపోయింది. దీంతో గోవిందరాజు, మణి దంపతులు కారుదిగి వచ్చి వైసీపీ శ్రేణులకు మద్దతుగా జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేసి సమైక్యవాదులను ఉత్తేజపరిచారు. నవ దంపతులను ైవె సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆశీర్వదించి గోదావరి జిల్లాల సంప్రదాయూన్ని ప్రకారం వధువుకు ఆడపడుచు కట్నం సమర్పించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించి ఆ జంటను మర్యాదపూర్వకంగా ముందుకు సాగనంపారు.

మరిన్ని వార్తలు