చేతిపైనే చివరి లేఖ..

3 Jun, 2018 09:17 IST|Sakshi

బొబ్బిలి/ సాలూరు రూరల్‌: దేవుడిచ్చిన వందేళ్ల జీవితాన్ని అవగాహనా లోపంతో నాశనం చేసుకుంటున్నారు యువత. చిన్న చిన్న కారణాలు, అంతుబట్టని ఆలోచనలతో క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సాలూరు మండలం కోదుకరకవలసకు చెందిన ధనుంజయ్‌ (25) అనే యువకుడు రైలు ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. అక్కడి రైల్వే ట్రాక్‌పై శరీరం రెండు ముక్కలుగా ఉండటాన్ని చూసిన స్థానికులు, ట్రైన్‌ డ్రైవర్‌ (లోకోపైలట్‌) పోలీసు సిబ్బందికి సమాచారమందించారు.

ధనుంజయ్‌ తన చేతిమీద, ఒక చీటీపై ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. ‘సారీ అమ్మా..! నేను చనిపోతున్నా! ప్రస్తుతం బొబ్బిలి రైల్వే ట్రాక్‌పై ఉన్నా.. కాసేపట్లో తనువు చాలిస్తున్నా..! నాకు అందంగా ఉండాలని ఉంది. కానీ ఆ దేవుడు నన్ను అందంగా పుట్టించలేదు. అందువల్ల నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను. నేను ఎందుకు చనిపోతున్నానో పర్సులో రాసి పెట్టాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా కుటుంబ సభ్యులు చాలా మంచివారు. మృతదేహాన్ని నా కుటుంబ సభ్యులకు అప్పగించండని రాసి ఉంది. అలాగే మృతుడు తన అరచేతిపైకూడా తాను ఎందుకు చనిపోతుందీ రాసుకున్నాడు. 

కూలి పనులతో పెంచింది..
ధనుంజయ్‌ తండ్రి కృష్ణ చనిపోవడంతో తల్లి గౌరమ్మ కూలిపనులు చేస్తూ కుమారుడ్ని పెంచి ంది. ధనుం జయ్‌ ఇంట ర్మీడియట్‌ (వొకేషనల్‌)ను 2011లో పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.  ఈ క్రమంలో రాజ మండ్రి, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు వెళ్లి వివిధ కారణాల వల్ల వెనక్కి వచ్చేశాడు. ఈ క్రమంలో తాను అందంగా లేడనే ఆత్మన్యూనతా భావానికి గురయ్యాడు. పైగా తల్లి కష్టపడి పనిచేసి పెంచుతోందని, తాను కుటు ంబానికి భారమయ్యానని తరచూ బాధపడేవాడు. తాను చనిపోతానని గ్రామస్తుల వద్ద తరచూ అనేవాడు. అనుకున్నట్లుగానే శుక్రవారం రాత్రి బొబ్బిలిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఆత్మహత్య  చేసుకుంటాడనుకోలేదని తల్లి గౌరమ్మ కన్నీటిపర్యంతమైంది.

మరిన్ని వార్తలు