యువకుడిని బలిగొన్న గూడ్స్ ఆటో

16 Jul, 2014 02:24 IST|Sakshi
యువకుడిని బలిగొన్న గూడ్స్ ఆటో

మోడేకుర్రు (కొత్తపేట) : బాధలో ఉన్న తల్లీబిడ్డలకు సాయం చేయాలన్న తలంపుతో.. వారిని తీసుకుని మోటార్ బైక్‌పై ఆస్పత్రికి బయలుదేరిన యువకుడిని గూడ్‌‌స ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద సంఘటన మోడేకుర్రులోని మహాలక్ష్మి నగర్ వద్ద మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో ఇంకా ముగ్గురికి తీవ్రంగాను, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
 కొత్తపేట మండలం వాడపాలెం పెదపేటకు చెందిన నక్కా వరలక్ష్మి కుమార్తె ఏడేళ్ల మౌని అనారోగ్యంతో బాధపడుతోంది. ఎదురింట్లో ఉంటున్న  గెడ్డం వరప్రసాద్(21) సాయంతో అతడి బైక్‌పై వరలక్ష్మి తన కుమార్తెను తీసుకుని అమలాపురంలో ఉన్న ఆస్పత్రికి బయలుదేరింది. మోడేకుర్రు మహాలక్ష్మి నగర్ వద్ద అమలాపురం నుంచి రాజమండ్రి వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకుం టోంది. బస్సును ఓవర్‌టేక్ చేస్తూ.. అంబాజీపేట నుంచి కొత్తపేట వైపు వెళ్తున్న ఖాళీ గూడ్‌‌స ఆటో ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో వరప్రసాద్, వరలక్ష్మితో పాటు అంబాజీపేట మండలం గున్నేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దొమ్మేటి వెంకట లక్ష్మీనారాయణ, అంబాజీపేట కొర్లపాటివారిపాలేనికి చెందిన కముజు సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు.
 
 వారిని 108లో అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ గాయమైన వరప్రసాద్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. వరలక్ష్మి కుమార్తె మౌని, ఆటోలో ఉన్న నంద్యాల దుర్గారావు అనే వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. వీరు కూడా అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరప్రసాద్ తల్లి సత్యవతి మూ డేళ్ల క్రితం విద్యుదాఘాతంతో, తండ్రి లాజరు కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో వరప్రసాద్ కుటుంబానికి ఆధారమయ్యాడు. అతడికి ఇద్దరు అక్కయ్యలు, చెల్లి ఉన్నారు. అక్కయ్యలు కువైట్‌లో ఉండగా, వరప్రసాద్ చిన్న కారులో ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తూ చెల్లెలికి పెళ్లి చేశాడు.
 

మరిన్ని వార్తలు