నడిరోడ్డుపై కత్తితో యువకుడు హల్‌చల్‌

5 Nov, 2018 14:16 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ‘బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్..ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది..జనతా గ్యారేజ్‘ ఇది జూ.ఎన్టీఆర్‌ నటించిన ఓ సినిమాలోని డైలాగ్‌. అచ్చం ఆ సినిమా తరహాలోనే ‘మీ వెనుక  నేనున్నాను.. మీకు సమస్యలు ఉంటే నాకు చెప్పండి’ అంటూ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి హల్‌చల్‌ చేస్తున్నాడు ఓ యువకుడు. అంతే కాకుండా కత్తి పట్టుకొని నడిరోడ్డుపై వచ్చి హడావుడి చేశాడు.

తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ యువకుడు సోమవారం ఉదయం కత్తి పట్టుకొని కేకలు వేస్తూ నడిరోడ్డుపైకి వచ్చాడు.తన జనతాగ్యారేజ్‌కి సమస్యలు చెప్పాలంటూ గట్టిగా అరుస్తూ రోడ్డుపై అటూ ఇటూ తిరగసాగాడు. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. అతన్ని చూసి ఒక్కసారిగి  పరుగులు తీశారు. ఆ యువకుడు కత్తి పట్టుకొని ఫోన్‌ మాట్లాడూతూ.. ‘నా దగ్గరకి రా. క్షణాల్లో పరిష్కరిస్తా’  అంటూ కేకలు వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

జనతా గ్యారేజ్‌ గ్రూప్‌
అంతే కాదు ఆ యువకుడు జనతా గ్యారేజ్‌ పేరుతో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాడు. ‘ఎవరికైనా ఏదైన సమస్యలు ఉంటే వెంటనే గ్రూప్‌లో పెట్టండి. జనతా గ్యారేజ్‌ మీకు న్యాయం చేస్తుంది. జయహో జనతా ’అంటూ మెస్సేజ్‌  చేశారు. సమస్యలు ఉంటే నాకు ఫోన్‌ చేయ్యడంటూ ఓ నెంబర్‌ను కూడా గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు.  ఆ యువకుడి పేరు ప్రదీప్‌ అని, గ్రూప్‌లో ఉన్న మిగతా వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు