నా మీదే చేయి చేసుకుంటావా.. అంటూ

14 Sep, 2019 13:20 IST|Sakshi

సాక్షి, కర్నూలు : తన మీద చేయి చేసుకున్నాడన్న కసితో అన్ననే హతమార్చాడు తమ్ముడు. బనగానపల్లె మండలం గులాం అలియాబాద్‌ తండాలో ఈ దారుణం చోటుచేసుకుంది. తండాకు చెందిన ఈశ్వర్‌ నాయక్‌ కుటుంబ కలహాలతో ఇంట్లో గొడవ చేస్తుండగా, అన్న శంకర్‌ నాయక్‌ వారించాడు. ఈ క్రమంలో శంకర్‌ నాయక్‌ చేయి ఈశ్వర్‌ నాయక్‌కు తగలడంతో కోపోద్రిక్తుడైన తమ్ముడు పిడిబాకుతో అన్నను పొడిచాడు. దీంతో అన్న శంకర్‌ నాయక్‌ అక్కడికక్కడే కూలబడి మృతి చెందాడు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా