యువతిపై బ్లేడ్‌తో దాడిచేసిన ఉన్మాది

11 Mar, 2014 22:41 IST|Sakshi

ప్రకాశం జిల్లా: యువతులపై, మహిళలపై దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లకు రక్షణ కల్పించేందుకు నిర్భయ వంటి చట్టాలను ప్రభుత్వం తెచ్చిన కూడా ఈ ఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. యువతిపై బ్లేడ్‌తో యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పోలవరంలో చోటుచేసుకుంది.

 

యువతిపై బ్లేడ్‌తో దాడిచేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు తెలిసింది. ఆ యువతి పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సింది వుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా