లారీ ఢీకొని యువకుడు మృతి

30 Jun, 2015 16:16 IST|Sakshi

రాజమండ్రి రూరల్ : వేగంగా వెళ్తున్న లారీ.. సైకిల్‌పై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని బొమ్మూరు గ్రామంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే... బొమ్మూరు గ్రామానికి చెందిన అరుణ్(18) పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సైకిల్‌పై వెళ్తుండగా సిలిండర్ల లోడ్‌తో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు