పాతబస్తీలో యువకుని ఆత్మహత్యాయత్నం

11 Mar, 2014 09:51 IST|Sakshi
పాతబస్తీలో యువకుని ఆత్మహత్యాయత్నం

ఓ వైపు షేర్ మార్కెట్ ట్రేడింగ్లో నష్టం, మరోవైపు అండగా ఉంటానన్న క్రిమినల్ లాయర్ మోసం చేయడంతో లతీఫ్ అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ఘటన నగరంలోని పాతబస్తీలో సోమవారం రాత్రి  చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పాతబస్తీకి చెందిన లతీఫ్ షేర్ మార్కెట్లో మధ్యవర్తిగా ఉండి ట్రేడింగ్ చేస్తున్నాడు. ఇటీవల వరుసగా నష్టం రావడంతో సొమ్ము మదుపుదారులను నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది.

 

ఆ క్రమంలో లతీఫ్ నగరంలోని క్రిమినల్ లాయర్ను ఆశ్రయించాడు. దాంతో సదరు లాయర్ లతీఫ్కు రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చాడు. అనంతరం లతీఫ్కు చెందిన ఇంటి డాక్యుమెంట్లు, ఖాళీ పత్రాలు, పాస్ పోర్ట్ తీసుకోవడమేకాకుండా పలు ఖాళీ చెక్కులపై అతనితో సంతకాలు చేయించుకున్నాడు. ఆ తర్వాత లాయర్ లతీఫ్ను బ్లాక్ మొయిల్ చేయడం ప్రారంభించాడు.

 

దాంతో లతీఫ్ మోసపోయానని భావించి గత అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడాడ్డు. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 50 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బేగంబజార్ పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు