నెల్లూరులో యువ ఓటర్లదే అంతిమ తీర్పు

22 Mar, 2019 12:50 IST|Sakshi

సాక్షి, నెల్లూరు(పొగతోట): ఈ దఫా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలు యువత చేతుల్లో ఉన్నాయి. ఓటు నమోదుకు ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో యువ ఓటర్లు అధికంగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 18 నుంచి 39 ఏళ్ల లోపు నవ..యువతరం ఓట్లు కీలకం కానున్నాయి. యువ ఓట్లు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ అభ్యర్థులకు విజయం వరించినట్లే.

జిల్లాలో ఓటర్లు 22,06,652 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 18 నుంచి 39 ఏళ్ల వయస్సు ఓటర్లు 10,52,397 మంది ఉన్నారు. 40 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఓటర్లు 81,7303 మంది ఉన్నారు. జిల్లాలో 80 సంవత్సరాల వయస్సు పైబడిన వారు 27,723 మంది ఉన్నారు.

18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఓటర్లు 27,507 మంది మాత్రమే ఉన్నారు. ఈ నెల 25వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. నూతన జాబితాలో సుమారు 1.60 లక్షల ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా సంఖ్య 20,63604 మంది ఉన్నారు. 8 ఏళ్లలో జనాభా పెరిగారు. ప్రస్తుతం జిల్లా జనాభా 32 లక్షలకు పైగా ఉన్నారు.

మరిన్ని వార్తలు