స్పెషల్‌ డీఎస్సీ కోసం ఆందోళన

12 Jul, 2018 08:46 IST|Sakshi
 టెట్‌ క్వాలిఫైడ్‌  అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం  జిల్లా అధ్యక్షుడు  సురేష్‌కుమార్‌

పాడేరు రూరల్‌: ఐటీడీఏ పరిధిలో  ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అరుకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.  టెట్‌ క్వాలీఫైడ్‌  డీఎడ్‌ అభ్యర్థులు బుధవారం పాడేరులో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. పాత బస్టాండ్‌ నుంచి సినిమాహాల్‌ సెంటర్‌ మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌ మాట్లాడారు.

బీఎడ్‌ చది విన వారికి కూడా ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం కల్పి స్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోట్‌ను వెనక్కి తీసుకోవాలని, స్పెషల్‌ డీఎస్సీ కోసం వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డీఎడ్‌ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం ఐటీడీఏ ఇన్‌చార్జీ పీవో డీకే బాలాజీకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు కె.వై.కుమార్, కార్యదర్శి టి.విజయ్‌కుమార్, నాయకులు కె.కుస్టో, సోమేష్, డి.ధనురాష్, శ్యామ్యుల్, ఏజెన్సీ 11 మండలాల నుంచి డీఎడ్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు