అర్థరాత్రి దెయ్యాలు.. పట్టుకున్న పోలీసులు..!!

25 May, 2018 10:35 IST|Sakshi
దెయ్యం వేషాల్లో యువకులు

సాక్షి, విజయవాడ : నగరంలో అర్థరాత్రి దెయ్యం వేషాలతో యువకులు ప్రజలను బెంబేలెత్తించారు. హారర్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ పేరుతో దెయ్యాల వేషాలు వేసుకుని ఏలూరు రోడ్డుపైకి రావడంతో ప్రజలు హడలిపోయారు. వీరి దెబ్బకు దాదాపు రెండు గంటల పాటు ప్రజలు భయంతో వణికిపోయారు. దీంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న మాచవరం పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో షార్ట్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ కోసమే వేషాలు వేసినట్లు యువకులు చెప్పారు. సోషల్‌మీడియాలో వదంతులతో అసలే బిక్కుబిక్కుమంటున్న నగరవాసులు దెయ్యం వేషం వేసుకున్న వారిని చూసి మరింత బెదిరిపోయారు. కేవలం షార్ట్‌ఫిల్మ్‌ కోసమేనా? లేక మరేదైనా కోణం ఈ ఘటనలో ఉందా? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు