కరోనా నివారణ చర్యల్లో ఏపీ నంబర్‌–1

20 Apr, 2020 08:11 IST|Sakshi
జెండా ఊపి నిత్యావసర వస్తువుల కిట్ల పంపిణీని ప్రారంభిస్తున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 

ప్రొద్దుటూరు : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో ఏపీ నంబర్‌ 1గా ఉందని ఎంపీ వైఎస్‌ అవినా‹Ùరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రొద్దుటూరు పరిధిలోని రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు నిత్యావసర వస్తువుల కిట్ల సరఫరాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏపీలో నంబర్‌ 1గా ఉన్నాయని జాతీయ మీడియా కితాబిచ్చిందన్నారు. దక్షిణ కొరియా నుంచి 10 లక్షల ర్యాపిడ్‌ కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇప్పటికే లక్ష కిట్లు రాష్ట్రానికి వచ్చాయన్నారు. మండల స్థాయిలో కూడా పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాపిడ్‌ కిట్లకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నిత్యం ప్రొద్దుటూరులోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి ట్రూనాట్‌ సెంటర్‌ రావడానికి ఎమ్మెల్యే కృషి ఉందన్నారు.

షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ అధినేత విశ్వేశ్వరరెడ్డి ద్వారా ఇప్పటికే జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు పరిధిలోని రెడ్‌ జోన్‌ ప్రాంతాలకు సంబంధించి 12వేల వరకు కిట్లు కావాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కోరినట్లు చెప్పారు. ఆ మేరకు ప్రస్తుతం 10వేల కిట్లు వచ్చాయని, వీటి విలువ రూ.30 నుంచి 40 లక్షల వరకు అవుతుందన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో పనిచేస్తున్న పలు రకాల కారి్మకులకు బియ్యం ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు, మాస్‌్కలు, శానిటైజర్లను పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం 53 మంది ఆశాకార్యకర్తలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్‌ నివారణకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఎంపీ ద్వారా వచ్చిన కిట్లతోపాటు రూ.10లక్షలు తాను వెచ్చించి పది రోజులకు సరిపడ కూరగాయలను కూడా అన్ని ఇళ్లకు సరఫరా చేస్తానన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రాధ, డీఎస్పీ లోసారి సుధాకర్, వైఎస్సార్‌సీపీ నాయకులు పాతకోట బంగారుమునిరెడ్డి, మురళీధర్‌రెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, వంగనూరు మురళీధర్‌రెడ్డి, కేశవరెడ్డి, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు