214వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

16 Jul, 2018 18:19 IST|Sakshi

సాక్షి, అనపర్తి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది.  ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. 

వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం చేరుకున్న తర్వాత జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం రామేశ్వరం మీదుగా కొవ్వాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి రాజన్న బిడ్డ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 213వ రోజు ప్రజాసంకల్పయాత్రను సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దాడ నుంచి పాదయాత్రను జననేత ప్రారంభించారు. అక్కడి నుంచి పెదపూడి, దొమ్మడ మీదుగా కరకుదురు వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ రోజు వైఎస్‌ జగన్‌ 9.3 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటి వరకు ఆయన 2,543.2 కిలో మీటర్లు నడిచారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!