292వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

22 Oct, 2018 20:10 IST|Sakshi

సాక్షి, సాలూరు : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 292వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమనోత్సవం పురస్కరించుకుని మంగళవారం పాదయాత్ర మధ్యాహ్నం వరకే సాగనుంది. ఈ ఉత్సవంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు.

వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం సాలూరు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సీతమ్మదొరపాలెం క్రాస్‌ రోడ్డు, చంద్రప్పవలస క్రాస్‌రోడ్డు, దేవబుచ్చమ్మపేట, వల్లాపురంల మీదుగా సన్యాసిరాజుపేట వరకు పాదయాత్రను కొనసాగిస్తారు.

ముగిసిన 291వ రోజుపాదయాత్ర
సాలూరు బహిరంగ సభ అనంతరం వైఎస్‌ జగన్‌ 291వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. నేడు జననేత పాదయాత్ర తారాపురం, మిర్తివలస క్రాస్‌ రోడ్డు, కొట్టిక్కి జంక్షన్‌, జిన్నివలస క్రాస్‌ రోడ్డు మీదుగా సాలూరు వరకు సాగింది. ఇవాళ జననేత 11.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 3,193.6 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకున్నారు.

మరిన్ని వార్తలు