297వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

14 Nov, 2018 09:03 IST|Sakshi

సాక్షి, పార్వతీపురం: రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 297వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం పార్వతీపురం నియోజకర్గంలోని తామరఖండి శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి మీదుగా చినరాయుడు పేట వరకు పాదయాత్ర కొనసాగనుంది.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.


               
 

మరిన్ని వార్తలు