315వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

6 Dec, 2018 22:17 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం :  నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 315వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో అశేష ప్రజానీకం అపూర్వ  ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది. 

జననేత శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎస్‌.ఎం పురం మీదుగా కేశవరావు పేటకు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. లంచ్‌ బ్రేక్‌ అనంతరం మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి లక్ష్ముడు పేట, నవభారత్‌ నగర్‌ మీదుగా ఫరీదు పేట వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ​ 

ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 314వ రోజు ముగిసింది. గురువారం ఉదయం రెడ్డిపేట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు . అక్కడి నుంచి లోలుగు, నందివాడ క్రాస్‌, నర్సాపురం ఆగ్రహారం, కేశవదానుపురం క్రాస్‌, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు నేటి పాదయాత్ర కొనసాగింది. రాజన్న తనయుడు గురువారం 10.4 కిలోమీటర్లు నడిచారు. దీంతో జననేత ఇప్పటివరకు 3,400.7 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!