ముగిసిన 39వ రోజు ప్రజాసంకల్పయాత్ర

19 Dec, 2017 19:53 IST|Sakshi

సాక్షి, అనంతపురం :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు,  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 39వ రోజు ముగిసింది. పాదయాత్ర నేడు అనంతపురం జిల్లాలో తనకంటివారిపల్లి నుంచి ప్రారంభించారు. కృష్ణాపురం, రామసాగరం క్రాస్‌, యాదాలంకపల్లి క్రాస్‌, డీడీ కొట్టాల, మంగలమడక క్రాస్‌, గరుగుతండా, అగ్రహారం క్రాస్‌ మీదుగా పాముదుర్తి వరకు పాదయాత్ర కొనసాగించారు. వైఎస్‌ జగన్‌ ఇవాళ 16.3 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 547.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 

కృష్ణాపురం, పాముదుర్తిలో పార్టీ జెండాలను జగన్‌ ఆవిష్కరించారు. మరాలలో రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి మాట్లాడారు. మార్గమధ్యలో వైఎస్‌ జగన్‌ను మున్సిపల్‌ కార్మికులు కలిశారు. జీవో 279 రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలు లేక వలసపోతున్నామని వైఎస్‌ జగన్‌కు మడకశిర యువకులు గోడు వెళ్లబోసుకున్నారు.

>
మరిన్ని వార్తలు