నేడు రేణిగుంటకు జగన్ రాక

23 Mar, 2016 02:04 IST|Sakshi
నేడు రేణిగుంటకు జగన్ రాక

తిరుపతి మంగళం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి వస్తున్నారని ఆపార్టీ తిరుపతి నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాదు నుంచి బయలుదేరి ఉదయం 8గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు.

ఈ సందర్భంగా అధినేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, అనుబంధ విభాగాల నాయకులు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు