'సీఎం జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారు'

21 Dec, 2019 18:12 IST|Sakshi

సాక్షి, అరకులోయ : అరకువ్యాలీలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, అరకు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. కుంభా రవిబాబు మాట్లాడుతూ... అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని అన్నారు. 

కుల, మతాలకు అతీతంగా రాష్ట్రమంతా అభివృద్ది చేయాలని ఆకాంక్షిస్తున్న వైఎస్‌ జగన్‌ సుదీర్ఘ కాలంపాటు ఆరోగ్యవంతంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని పాదయాత్ర వైఎస్‌ జగన్‌ చేశారని, మరో 30 ఏళ్లు ఆయనే రాష్ట్రానికి సీఎంగా ఉండాలని వ్యాఖ్యానించారు. రెండు కోట్ల మంది ప్రజలను స్వయంగా కలిసి వారి కష్టాలను తెలుసుకొని హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. చట్టాలను అమలు చేయడంలో దేశానికి సీఎం జగన్‌ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.అన్ని ప్రాంతాల్లో  అభివృద్ది సమానంగా జరగాలనే మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు