చిన్నపరెడ్డి కుటుంబానికి జగన్ ఓదార్పు

8 Jan, 2014 11:54 IST|Sakshi
చిన్నపరెడ్డి కుటుంబానికి జగన్ ఓదార్పు

చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన చిన్నపరెడ్డి కుటుంబాన్ని బుధవారం జగన్ ఓదార్చారు.

వైఎస్సార్ అంటే చిన్నపరెడ్డికి ఎంతో అభిమానం ఉండేదని ఆయన హయాంలో వృద్ధాప్య పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, భర్త చనిపోయిన కూతరుకి వితంతు పెన్షన్ పొందామని చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులు ఈసందర్భంగా  జగన్‌కు తెలిపారు. జగన్ వారికి అన్నివిధాలా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.

చింతలపల్లెవారి క్రాస్, బురుజుపల్లె, తెట్టుపల్లె, ఈరల్లపల్లె క్రాస్, చిన్నసోమల క్రాస్లో రోడ్ షో నిర్వహిస్తారు. సోమలలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అడుసుపల్లె, సరస్వతీపురం, నింజంపేట, మల్లేశ్వరపురం, రాంపల్లె, కలమండవారిపల్లె మీదగా పట్రపల్లె చేరుకుని అక్కడ పాదం మునస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

కమ్మపల్లె, శీలంవారిపల్లె, తంగేనిపల్లె, సవరంవారిపల్లె, గాంధీనగరం, గురికానివారిపల్లె మీదగా సదుం మండలం చేరకుంటారు. సదుం మండలంలో ఎస్.మతుకువారిపల్లె, నడిగడ్డ, హైస్కూల్ గడ్డలో రోడ్ షో నిర్వహించి యర్రాతివారిపల్లెలో రాత్రి బస చేస్తారు.

>
మరిన్ని వార్తలు