రైతే రాజయ్యేలా..

17 Mar, 2019 10:58 IST|Sakshi

 అన్నదాతల సంక్షేమానికి జగన్‌ వరాల జల్లు

‘వైఎస్సార్‌ భరోసా’ పై  రైతన్నల హర్షం

సాక్షి, శ్రీకాళహస్తి : రుణమాఫీ మాయాజాలంతో అంతు చిక్కని మోసం..విత్తన, ఎరువుల పంపిణీలో అవినీతి జాడ్యం..ధీమా ఇవ్వని పంటల బీమా, వాతావరణ బీమా పథకాలు..పంట రుణాల మంజూరులో తిరకాసులు..సంక్షేమ పథకాల లబ్ధిలో పైరవీలు...వెరసి ఐదేళ్ల టీడీపీ పాలనలో దగాపడ్డ అన్నదాతలు. తమను ఆదుకునే నాథుడే లేరా అంటూ ఎదురుచూస్తున్న తరుణంలో ప్రతిపక్షనేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో చిరుదివ్వెలా కనిపించిన వెలుగు.. మహాజ్వాలగా మారి అంధకారం నిండుకున్న రైతుల జీవితాల్లో వెలుగులు ప్రసరించ సాగింది.

నవరత్నాల పథకాలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా వరాలు ప్రకటించిన జననేత అన్నదాతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రకటించిన హామీలపై అన్నదాతల్లో హర్షం వ్యక్తంమవుతోంది.

‘సహాయనిధి’ చాలా సంతోషం
 2015లో అతివృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేదు.  ఈ ఏడాది అనావృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు రూ.4 వేల కోట్లు సహాయనిధి ఏర్పాటు చేస్తామని జగన్‌ హామీ ఇవ్వడం హర్షణీయం
– కలివేలయ్య, పాపనపల్లి

వడ్డీ రాయితీతో ఎంతో మేలు
బ్యాంకుల్లో తీసుకునే పంట రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించి రైతులకు పూర్తిగా రాయి తీ కల్పించడం ఎంతో మేలు. టీడీపీ ప్రభుత్వం విధానాలతో పంట రుణాలపై వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయి. జగన్‌ ఇచ్చిన హామీ పేద రైతులకు ఎంతో మేలు.
– ప్రసాద్‌నాయుడు,, సూరావారిపల్లి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు