మనవడొస్తాడు..అందరికీ ఇస్తాడు

1 Apr, 2019 11:50 IST|Sakshi

సాక్షి, కైకలూరు :  ‘వృద్ధులను గౌరవించడం మా బాధ్యత.. వారికి అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించి వారి శేషజీవితం ఆనందంగా గడిపేందుకు సహకరిస్తాం’. ఇది ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన మాటలు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లలో రాజకీయాలకు తెరలేపారు. అర్హులకు మొండిచేయి చూపిస్తూ జన్మభూమి కమిటీలు సూచించిన తమ పార్టీవారు వారు అర్హులు కాకపోయినా పింఛను ముట్టజెప్పారు.

‘అయ్యా.. మాకు పింఛను సొమ్ము రావడంలేదు. వృద్ధాప్యంలో మాకు కాస్త అండగా ఉండేది ఆ డబ్బులేనయ్యా’ అంటూ పండుటాకులు వేడుకుంటున్నా.. ఓపిక లేకపోయినా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈక్రమంలో కార్యాలయాల చుట్టూ తిరగలేక, మనోవ్యథతో, మందులకు డబ్బులులేక రాలిపోయిన పండుటాకులు ఎందరో.. పింఛన్లు పెంచామని డప్పులు కొట్టుకున్నారు గానీ.. మహానేత వైఎస్సార్‌ హయాంలో పింఛన్‌ పొందుకున్న దాదాపు 50శాతం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్‌ను దూరం చేశారన్నది జగమెరిగిన సత్యం.

ఈక్రమంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీపై అవ్వాతాతలు ఆశపెట్టుకున్నారు. గతంలో కులం, మతం, వర్గం, పార్టీ అంటూ చూడకుండా మహానేత వైఎస్సార్‌ నడిచిన బాటలోనే వైఎస్‌ జగన్‌ నడిచి మాకు న్యాయం చేస్తాడని కన్నీళ్లు నిండిన కళ్లతో ఎదురుచూస్తున్నారు...

జగన్‌ చేసేదే చెప్తారు...
వైఎస్‌ జగన్‌ నెలకు రూ2వేలు పింఛన్‌ ఇస్తానని నవరత్నాల్లో ప్రకటించడంతో ఎంతో ఆశపడ్డా. ఎన్నికలముందు చంద్రబాబు హడావుడిగా రూ.2వేలకు పెంచారు. ఇది ఎన్నికల గిమ్మిక్కని మాకుతెలుసు. ఇప్పుడు రూ.3వేలు ఇస్తానని చంద్రబాబు చెప్పే మాటలు నమ్మం. జగన్‌ చెప్పింది చేస్తాడనే నమ్మకం మాకుంది.
– చొప్పాల మహంకాళరావు, చినకామనపూడి

ఇన్నాళ్లు ఏమైంది? 
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతేనే వారిస్థానంలో కొత్తపింఛన్‌ మంజూరు చేసేవారు. దివంగత వైఎస్‌ దయతో అర్‌హుౖలకు అందరికీ పింఛన్‌ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు రకరకాల మాటలతో పింఛన్‌దారులను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నారు.ఇన్నాళ్లులేని జాలి ఇప్పుడే ఎందుకు చూపాల్సి వస్తుందో మాలాంటి వారికందరికీ తెలుసు.
– పి.సూర్యచంద్రరావు, చిగురుకోట

మరిన్ని వార్తలు