అగ్ర‌భాగంలో ఉంచినందుకు అభినంద‌న‌లు

22 Jul, 2020 15:11 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: బీసీల‌కు రాజ్యాధికారం క‌ల్పించ‌డంలో దేశంలోనే  వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ స్థానంలో ఉంద‌ని శ్రీకాకుళం వైస్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత వెనుక‌బ‌డిన జిల్లాలో బీసీల‌కు స్పీక‌ర్, ఉప‌ముఖ్య‌మంత్రి, మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వారా జిల్లా అభివృద్ధి దిశ‌గా దూసుకెళ్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాను రాజ‌కీయ ప్రాధాన్య‌త‌లో అగ్ర‌భాగంలో ఉంచినందుకు మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌కు అభినంద‌న‌లు తెలిపారు. మ‌త్య్స‌కారుల ప‌ట్ల సీఎం జ‌గ‌న్ కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చాలా గొప్ప‌వంటూ ప్ర‌శంసించారు. 

ఇక‌ ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీలో జగనన్న పచ్చతోరణం కార్య‌క‌ర్య‌మ్రాన్నిజిల్లా క‌లెక్ట‌ర్ జె నివాస్  ప్రారంభించారు. శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, జి.సందీప్ కృపాకర్ మొక్క‌లు నాటి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు