పేదింట.. చదువుల పంట

19 Mar, 2019 11:38 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ఐదేళ్ల కాలంలో అనేక మంది ప్రతిభ గల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. అనేక ఆంక్షలతో ఫీజుల్లో ఎగనామం పెట్టడంతో వారి ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కాలేజీలకు ఫీజులను పెంచుకునేందుకు అనుమతిలిచ్చేసిన టీడీపీ ప్రభుత్వం.. పెరిగిన ఫీజులకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపచేయలేదు.

కాలేజీ ఫీజు ఎంతైనా ప్రభుత్వం మాత్రం ఏటా రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తామని చెప్పింది. మంచి ర్యాంకు తెచ్చుకుని ఏ–గ్రేడ్‌ కళాశాలలో సీటు సంపాదించిన విద్యార్థులకు ఇదే వర్తింపజేసింది. దీంతో మిగిలిన ఫీజులు చెల్లించకలేక సీ గ్రేడ్, డీ గ్రేడ్‌ కళాశాలల్లోనే చేరాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్పయాత్ర ద్వారా విద్యార్థుల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తానని ప్రకటించారు. వీటితోపాటు ప్రతి ఇంటా ఉన్నత విద్యావంతులు ఉండాలనే లక్ష్యంలో అనేక వరాలిచ్చారు. జగన్‌ నిర్ణయం పట్ల విద్యార్థులు హర్హం వ్యక్తం చేస్తున్నారు.  

పేద విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన వరాలు..

  • పేద విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తారు
  • పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20 వేలు ప్రతి విద్యార్థికి ఇస్తారు.
  • సంవత్సరానికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల  వరకు ఇస్తారు. (ఫీజు ఎంతైతే అంత +రూ.20 వేలు)

ప్రభుత్వ సహకారం అందలేదు
2013లో వైజాగ్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. అగ్రశ్రేణి కళాశాల కావడంతో అక్కడ ఫీజు రూ. 80 వేలు ఉంది. ప్రభుత్వం కేవలం రూ.35 వేలు ఇస్తానని చెప్పడంతో మిగిలిన డబ్బు చెల్లించే స్థోమత లేక సీటు వదులుకున్నాను. ఇక గత్యంతర లేక గుంటూరులోని మామూలు కళాశాల్లో చేరాను. ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చి ఉంటే బీటెక్‌ చివరి సంవత్సరంలోనే మంచి ప్లేస్‌మెంట్‌ సాధించి ఉండేవాడిని. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు ఎత్తివేస్తామని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. 
– షేక్‌ అబ్దుల్‌ రజాక్, ఎంటెక్‌ విద్యార్థి, పిడుగురాళ్ల

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌