జ‌న‌తా బ‌జార్లు, ఈ -మార్కెటింగ్ సేవ‌ల‌పై సూచ‌న‌లు

1 Jul, 2020 20:19 IST|Sakshi

సాక్షి, అమరావతి : జనతా బజార్లు, ఈ– మార్కెటింగ్‌ సేవ‌ల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి  బుధవారం సమీక్ష నిర్వ‌హించారు. జనతా బజార్ల నిర్వహణలో భాగంగా  రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేసేలా చర్య‌లు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. రైతుల నుంచి నాణ్యమైన ఉత్పత్తులు వచ్చేలా చూడాలని, వాటిని నేరుగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రైతులను ఆదుకోవడంతో పాటు, వినియోగదారులకు మేలు చేకూర్చడమే జనతా బజార్ల ఉద్దేశ‌మ‌న్న ‌సీఎం.. రైతుల‌కు అండ‌గా నిల‌వాలన్నారు. ఈ స‌మావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న, స‌హా ఇతర అధికారులు పాల్గొన్నారు.  జనతా బజార్లలో పాలు, రొయ్యలు, చేపలు వంటి ఆక్వా ఉత్పతులను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాల‌ని  ముఖ్యమంత్రి స్ప‌ష్టం  చేశారు.

జనతా బజార్లు, ఆర్బీకేల ద్వారా ఈ–ఫ్లాట్‌ఫాం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏక కాలంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని వైఎస్ జ‌గ‌న్ సూచించారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి  ఆర్బీకేల పరిధిలో గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు, గ్రేడింగ్‌ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాల‌న్నారు. వీటి నిర్వ‌హణ కోసం మండ‌ల స్థాయిలో ఓ అధికారిని నియ‌మించాల‌ని పేర్కొన్నారు.  ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే నాటికి పంటలకు కల్పించాల్సిన కనీస గిట్టుబాటు ధ‌రలపై కూడా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్‌ అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా ఆక్వా సాగు ప్రాంతాల్లో ఉత్ప‌త్తులు నిల్వ చేసేందుకు అవ‌స‌ర‌మైన గోడౌన్ల నిర్మాణం చేయాల‌ని తెలిపారు. (ఏపీ ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం: ఐఎంఏ )

స‌మీక్ష అనంత‌రం వ్య‌వ‌సాయ శాఖ‌మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు మాట్లాడుతూ..రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పొగాకు కొనుగోలులో ప్రభుత్వం జోక్యం చేసుకుంద‌ని తెలిపారు. కొనుగోళ్లు జ‌రుగుతున్న తీరు, వివ‌రాల్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నార‌న్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన ధరల జాబితాను కొనుగోలు కేంద్రాల్లో ప్రకటించాల‌ని సీఎం ఆదేశించిన‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన దానిక‌న్నా త‌క్కువ‌కు కొనుగోలు కాకుండా, రైతులు న‌ష్ట‌పోకుండా చూడాల‌ని సూచించారని కన్న‌బాబు వెల్ల‌డించారు. (కంగ్రాట్స్​ సీఎం సార్ )

మరిన్ని వార్తలు