27న తాడేపల్లిలో జగన్‌ గృహప్రవేశం

25 Feb, 2019 04:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి లో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయను న్నారు. అలాగే పార్టీ నూతన కేంద్ర కార్యాల యాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులంద రూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటనలో తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు