రేపటి నుంచి వైఎస్‌ఆర్ జనభేరి

2 Apr, 2014 06:18 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురు, శుక్రవారాల్లో జిల్లాలో పర్యటిస్తారు. వైఎస్‌ఆర్ జనభేరి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆయన ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రొగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశీల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పరిశీలకుడు కొయ్యా ప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
వారు చెప్పిన వివరాల ప్రకారం  జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి రాజాం, పొందూరు మీదుగా శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తారు. గురువారం ఉదయం పలాస పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహిస్తారు.
 
సాయంత్రం ఐదు గంటలకు టెక్కలి చేరుకుంటారు. అక్కడి వైఎస్‌ఆర్ కూడలిలో జరిగే వైఎస్‌ఆర్ జనభేరి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఇచ్ఛాపురం చేరుకొని ఆ రాత్రి అక్కడ బస చేస్తారు. శుక్రవారం ఉదయం ఇచ్ఛాపురం పట్టణంలో రోడ్‌షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకొని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళతారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు