రైతురాజ్యం వస్తుందయ్యా..

13 Nov, 2017 05:32 IST|Sakshi

ఏం.. పెద్దాయనా.. ఏం పంట వేశావ్‌? ఏం.. చెప్పమంటావయ్యా.. ఎంత కట్టం చేసినా ఫలితం లేదు.  9 ఎకరాలు వరి సాగు చేసినా.. పొట్ట దశలో ఉంది. నిరుడు 40 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇప్పుడేమో ఒకటే తెగులు.  పది బస్తాలు కూడా దిగుబడి వచ్చాదో.. రాదో.. ఎకరాకు 15 వేలు పెట్టుబడి ఖర్చు అయితాంది. అయినా ఏం లాభం.. నాశనమై పోతాండాం. ఇట్టే ఉంటే పాణం తీసుకోక ఏం చేయాల సామి.. ఆయప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రుణమంతా మాఫీ చేచ్చానన్న్యాడు. నేను లింగాపురం సొసైటీ బ్యాంకులో 70 వేలు రుణం తీసుకున్న్యా.. ఒక్క రూపాయి మాఫీ అయ్యింటే ఒట్టు. లెక్కంతా వడ్డీకే సరిపోతాంది.. ఇట్టాగుంటే మేం ఎట్టా బతకాల నాయనా.. మా బతుకింతేనా..?

వైఎస్‌ జగన్‌: లేదయ్యా.. దిగులు పడొద్దు.. త్వరలోనే మన 
ప్రభుత్వం వస్తుంది. రైతు రాజ్యం అవుతుంది. కష్టాలన్నీ 
తొలగిపోతాయి. అందరినీ ఆదుకుంటా... ధైర్యంగా ఉండండి..

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను ఆదివారం ప్రొద్దుటూరు మండలం హౌసింగ్‌బోర్డులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొనిరెడ్డి శివచంద్రారెడ్డితో పాటు కొత్తపల్లె వెంకటసుబ్బయ్య పలువురు రైతులు కలిశారు.  కానపల్లె గ్రామానికి చెందిన రైతు వజ్జల పెద్ద సుబ్బన్న యాదవ్‌ తన బాధను ఏకరువు పెట్టగా త్వరలోనే మంచి రోజులొస్తాయని ఆయన ధైర్యం నింపారు. 

మరిన్ని వార్తలు