గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ సమావేశం

25 May, 2019 16:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు.  వైఎస్సార్‌ ఎల్పీ తీర్మాన ప్రతిని అందచేసిన జగన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా గవర్నర్‌ను కలిశారు. కాగా మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సాఆర్‌ సీపీ 151, తెలుగుదేశం పార్టీ 23, జనసేన పార్టీ 1 స్థానాన్ని గెలిచిన విషయం తెలిసిందే. ఇక గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

మరిన్ని వార్తలు