గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ..

30 Mar, 2020 16:43 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ పరిస్థితులను సీఎం జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. కరోనా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గవర్నర్‌ కార్యాలయంలోకి వెళ్లే ముందు సీఎం వైఎస్‌ జగన్‌ శానిటైజర్‌తో తన చేతులను శుభ్రం చేసుకున్నారు. అలాగే సమావేశంలో కూడా గవర్నర్‌, సీఎం జగన్‌లు సామాజిక దూరం పాటించారు. 


అంతకుమందు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు, నిత్యావసరాలు, రేషన్‌ సరఫరాపై కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్టీవోలు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెస్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా కట్టడి కోసం అర్బన్‌ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలన్నారు.

చదవండి : సీఎం వైఎస్‌ జగన్‌ చొరవ.. ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర

మరిన్ని వార్తలు