ప్రజా సంకల్పానికి జేజేలు

9 Jan, 2019 14:05 IST|Sakshi
మహిళా సదస్సులో అక్కాచెల్లెమ్మల కష్టాలు తెలుసుకుంటున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్‌

జిల్లాలో 18 రోజులపాటు263 కి.మీ. కొనసాగిన ప్రజా సంకల్పయాత్ర

ఎనిమిది బహిరంగ సభలు.. నాలుగు ఆత్మీయ సదస్సులు

అన్ని వర్గాల్లో భరోసా నింపిన జననేత

వైఎస్‌ఆర్‌సీపీ తొలి అభ్యర్థి ప్రకటన  

అసమర్థ పాలనను ఎండగడుతూ.. అభ్యాగులకు భరోసానిస్తూ ప్రజా సంకల్పయాత్రికుడు  జిల్లాలో అడుగు పెట్టింది మొదలు.. ఊరూరా జనంనీరాజనం పలికారు. పేదల బతుకుల్లో చీకటి తెరలు తొలగించే వెలుగు రేఖలా కనిపించిన జననేతలో రాజన్నను చూసుకున్నారు. వేలాది అడుగులు వెంట నడిచాయి. పల్లెలు కదిలి వచ్చాయి. అలుపెరగని నేతకు గ్రామ గ్రామాన ఆత్మీయ స్వాగతం పలికి.. గుండెల నిండా
అభిమానంతో జనహారతి పట్టారు. ప్రజా సంకల్పానికి జేజేలు పలికారు. బుధవారం ప్రజా సంకల్పయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలో సాగిన యాత్ర విశేషాలు గుర్తు చేసుకుంటూ.. 

కోవెలకుంట్ల :జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి పాదయాత్ర ప్రారంభమై 14 మండలాల మీదుగా 263 కి.మీ. మేర సాగింది. 18 రోజుల పాటు జిల్లాలో కొనసాగి తుగ్గలి మండలం ఎర్రగుడి వద్ద అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. బహిరంగ సభలు, ఆత్మీయ సదస్సులు, ముఖాముఖి కార్యక్రమాలతో అన్ని వర్గాలకు భరోసా కలిగించారు.

బడుగులకుఆత్మ బంధువులా..
2017 నవంబర్‌ 27న కోడుమూరు మండలం గోరంట్ల వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బీసీ ప్రతినిధులు తెలుగుదేశం పాలనలో చంద్రబాబునాయుడు చేస్తున్న మోసాలను ఏకరువు పెట్టారు. బీసీల ఆవేదన, అన్యాయాలను విన్న జగన్‌ బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా ఉండి  బాసటగా నిలుస్తామని భరోసా కల్పించారు. బీసీలను అన్ని విధాలా ఆదుకునేందుకు బీసీ గర్జన నిర్వహించి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి వచ్చే ఎన్నికల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏదో ఒక చోట ఎంపీ టికెట్‌ బోయలకు కేటాయిస్తామని చెప్పడం ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 108, 104 తరహాలో 102 అందుబాటులోకి తెస్తామని, ఈ అంబులెన్స్‌ ద్వారా  గొర్రెలు, ఆవులను రక్షించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

వైఎస్‌ఆర్‌సీపీతొలి అభ్యర్థి ప్రకటన ఇక్కడే..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో కర్నూలు జిల్లాకు చెందిన కంగాటి శ్రీదేవి (పత్తికొండ)ని వైఎస్‌ఆర్‌సీపీ తొలి అభ్యర్థిగా ప్రకటించారు. జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉండగా 2014 ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలతో పాటు పదకొండు అసెంబ్లీ స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, కోడుమూరు, కర్నూలు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వైఎస్‌ఆర్‌సీపీకి వస్తున్న ఆదరణ చూడలేక టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడింది. ఈ క్రమంలో జిల్లాలోని పత్తికొండ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డిని హతమార్చారు. 2017వ సంవత్సరంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర జిల్లాలో  పార్టీ ఫిరాంపు ఎమ్మెల్యే నియోజకవర్గం ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఎమ్మెల్యేలు మారినా ప్రజలంతా వైఎస్‌ఆర్‌సీపీకి అండగా ఉండటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. జిల్లాలో పాదయాత్ర ముగిసేవరకు జగన్‌ అడుగుల్లో  వేలసంఖ్యలో అడుగులు పడ్డాయి. రైతులు, కూలీలు, యువకులు, మహిళలు, వృద్ధులు సైతం జననేత వెంట నడిచేందుకు ముందుకు రావడంతో పాదయాత్ర సాగని ప్రయాణమైంది. అన్ని వర్గాల ప్రజల భవిష్యత్‌కు భరోసానిస్తూ పాదయాత్ర సాగగా జననేతకు ఊరూరా అçపూర్వ స్వాగతం లభించింది. వైఎస్‌ఆర్‌సీపీ మొదటి అభ్యర్థిగా శ్రీదేవిని పార్టీ అధినేత ప్రకటించడంతో జిల్లాకు అరుదైన అవకాశం

పాదయాత్రకు జనాభి‘వంద’నం
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో మూడు మైలురాళ్లను దాటింది. 2017 నవంబర్‌ 14న వైఎస్‌ఆర్‌ జిల్లా నుంచి చాగలమర్రి సమీపంలో కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలో 18 రోజులపాటు పాదయాత్ర కొనసాగగా చాగలమర్రి మండలం గొడిగనూరు సమీపంలో వంద కి.మీ. మైలురాయిని చేరుకుంది. డోన్‌ నియోజకవర్గంలోని ముద్దవరం వద్ద 200 కి.మీ., ఆలూరు నియోజకవర్గంలోని కారుమంచి వద్ద 300 కి.మీ. మైలురాయిని చేరింది.    

అన్నదాతకు అండగా..
తెలుగుదేశం పాలనలో రైతులు కన్నీరు పెడుతున్నారని, మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో తిరిగి రామరాజ్యం తీసుకొస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రైతులకు భరోసా కల్పించారు. 2017 నవంబర్‌ 27వ తేదీన కోడుమూరులో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో   అన్నదాతకు అండగా నిలిచారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు దిగుబడులను గోదాముల్లో ఉచితంగా నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్‌స్టోరేజి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.  రైతు భరోసా కింద నాలుగేళ్ల పాటు ఏటా మే నెలలోనే పెట్టుబడుల కోసం రూ. 12,500 అందజేసి అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు.   డిసెంబర్‌ 4వ తేదీన తుగ్గలి మండలం ఎర్రగుడి వద్ద జరిగిన రైతు సదస్సులో రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం చిన్నాభిన్నం కాకుండా వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా ఆ కుటుంబానికి తక్షణమే రూ. 5 లక్షల ఆర్థిసాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.   

పెద్దకొడుకులా.. 
2017 నవంబర్‌ 20వ తేదీన బనగానపల్లె మండలం హుసేనాపురం వద్ద నిర్వహించిన మహిళా సదస్సులో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు  మహిళలకు కొండంత ధైర్యాన్ని నింపాయి.  
వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే పిల్లల చదువుకు ఏడాదికి రూ. 15వేలు,  పెద్ద చదువులకు అయ్యే ఫీజులను చెల్లిస్తామని, హాస్టల్‌ ఖర్చులకు  ఏడాదికి రూ. 20వేలు ఇస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.  
పేద కుటుంబాలకు చార్జీల మోత నుంచి ఉపశమనం కల్పించేలా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా అందజేస్తామని, పొదుపు మహిళలకు  ఎన్నికల నాటికి ఎంత అప్పులున్నాయో నాలుగు దఫాల్లో చెల్లిస్తామన్నారు.
జన్మభూమి కమిటీలు ఉండవని, ఎవరికీ రూపాయి లంచం ఇవ్వాల్సిన పనిలేదని వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు మహిళలకు కొండంత అండగా నిలిచాయి.  
కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని అధికారంలోకి రాగానే దశల వారీగా నిషే«ధిస్తామని హామీ ఇచ్చారు.
గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 72 గంటల్లోనే రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, పింఛన్‌ అందజేస్తామన్న జననేత హామీ  పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు