సర్కారు నిర్లక్ష్యంపై గర్జించిన జగన్

3 May, 2016 02:06 IST|Sakshi
సర్కారు నిర్లక్ష్యంపై గర్జించిన జగన్

మాచర్లలో కరువు ధర్నాకు భారీగా తరలివచ్చిన ప్రజానీకం
వేలాదిగా కదం తొక్కిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు  
ఖాళీ కుండలు, బిందెలతో భారీ ప్రదర్శన
మహిళల గోడు ఆలకించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి,ఎమ్మెల్యే పీఆర్కే


కరువుపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. జనం ఘోషను ఎలుగెత్తి చాటారు. కరువు పరిస్థితులపై చంద్రబాబు అనుసరిస్తున్న   ప్రజావ్యతిరేక విధానాలపై  సింహంలా గర్జించారు. సోమవారం మాచర్ల పట్టణంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన కరువు ధర్నాకు వేలాది మంది జనం కదం తొక్కారు. ఆందోళనకు మద్దతు పలికారు.  
 
మాచర్ల:కరువు సహాయ చర్యలను ప్రభుత్వం చేపట్టకుండా నిర్లక్ష్యం వహించటంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మాచర్లలో బిందె చేతబట్టి పురపాలక సంఘ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి కుండ, బిందెలను నెత్తిపై పెట్టుకొని కొద్దిసేపు నిరసన కొనసాగించారు. పురపాలక సంఘ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఖాళీ బిందె, కుండ చేతబట్టి ముందుకు సాగారు. వందలాది మంది మహిళలు ఖాళీ బిందెలతో నిలబడి ఉండగా వారందరికీ మద్దతుగా జగన్, పీఆర్కేలు నిరసన వ్యక్తం చేస్తూ మహిళల గోడును ఆలకించారు. కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు బూదాల మరియమ్మ, మహిళా కౌన్సిలర్ అన్నెం అనంతరావమ్మ, పాముల సంపూర్ణ, పుట్లూరి రమాదేవి, పద్మ, జెడ్పీటీసీ సభ్యుడు శేరెడ్డి గోపిరెడ్డి, ఎంపీపీ కుర్రి సంపూర్ణ, ఓరుగంటి పార్వతమ్మ, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు కుర్రి సాయి మార్కొండారెడ్డి, ఓరుగంటి జయపాల్‌రెడ్డి, మైనార్టీ నాయకుల గంగిజాన్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వర్లు, మెట్టు శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డి, రామకృష్ణారెడ్డి, బోరింగుల సుబ్బారెడ్డి, చిన్నినాయుడు, వాచ్ సుభాని, పిల్లి కొండ, వెంకటేశ్వర్లు, కొత్తమాసు పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.


 ఎటు చూసినా జన సంద్రమే...
సాగర్ రింగ్‌రోడ్డు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు కదం తొక్కుతూ జగన్‌కు జేజేలు పలుకుతూ ప్రదర్శన నిర్వహించారు. మాచర్ల రూరల్, పట్టణం, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, కారంపూడి మండలాల నాయకుల ఆధ్వర్యంలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, రైతులు, మహిళలు జగన్ కోసం ఎదురు చూస్తూ పట్టణ శివారులోని రింగ్‌రోడ్డుకు చేరుకున్నారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, అర్బన్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి,  రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలతో కలిసి జగన్‌మోహన్‌రెడ్డి వాహనంపై నిలబడగా రోడ్డుకిరువైపులా వేలాది మంది అభిమానులు, యువకులు, రైతు లు, కార్యకర్తలు ముందుకు సాగుతూ ప్రదర్శలో పాల్గొనటంతో ఎటు చూసినా జన సంద్రంతో ర్యాలీ కొనసాగింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయానికి చేరుకోవటానికి 40 నిమిషాలు పట్టింది.

జగన్ వాహనానికి ముందు వెనుకా వేలాది మంది కదం తొక్కుతూ ర్యాలీలో నడిచారు. భవనాలపై విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ప్రదర్శన తిలకిస్తూ చేతులూపుతూ జగన్‌కు తమ అభిమానాన్ని తెలిపారు. గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, నరసరావుపేట, రాజుపాలెం, యర్రగొండపాలెం, మార్కాపురం, వినుకొండ ప్రాంతాల నుంచి భారీ ప్రజలు హాజరయ్యారు.

 జననేత జగన్‌ను కలిసిన నేతలు...
 కరువుపై పోరుకొచ్చిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు నేతలు కలిశారు.

మరిన్ని వార్తలు