హ్యాపీ బర్త్‌డే సీఎం సర్‌

21 Dec, 2019 09:53 IST|Sakshi

అనంతపురం కల్చరల్‌:  హ్యాపీ బర్త్‌డే సీఎం సర్‌..అంటూ పెద్ద పెట్టున యువత కేరింతలు, కేకలతో నగర వీధులు మార్మోగాయి. భారీఎత్తున పేల్చిన  బాణాసంచా పేలుళ్లు, విద్యుద్దీప కాంతుల నడుమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి జన్మదిన వేడుకలు సంబరంగా జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి  స్థానిక సుభాష్‌రోడ్డులోని దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహం వద్ద విద్యార్ధి విభాగం అనంతపురం, హిందూపురం పార్లమెంట్ల ఇన్‌చార్జి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు  ఘనంగా జరిగాయి.  రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తదితరులు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ కట్‌ చేశారు.   ప్రజలందరి ఆనందమే లక్ష్యంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి అందరూ మద్దతు పలకాలని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బోయ రాజారామ్, నాగేష్‌రెడ్డి, వరప్రసాదరెడ్డి, వడ్డేశీన, డాక్టర్‌ శ్రీనివాసులు,  కురుకుంట మాధవరెడ్డి, విద్యార్థి సంఘం నాయకులు సుధీర్‌రెడ్డి, సునీల్‌ దత్త, జయచంద్రారెడ్డి, రాధాకృష్ణ యాదవ్‌  పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైదరాబాద్‌ బస్సులకు రిజర్వేషన్‌ నిలిపివేత

క్రైస్తవులు రేపు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి

కోవిడ్‌–19 నియంత్రణకు రూ.374 కోట్లు

పారిశుధ్య యుద్ధం!

4 జిల్లాల్లోనే ఎక్కువ కేసులు

సినిమా

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు