రాఖీపౌర్ణమి ఒక విశిష్టమైన పండుగ: వైఎస్‌ జగన్‌

7 Aug, 2017 11:21 IST|Sakshiహైదరాబాద్‌:
అన్నా-చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీపౌర్ణమి పండుగ సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెలెళ్ల ప్రేమానుబంధాలను, పరస్పర అనురాగాన్ని చాటే రాఖీపౌర్ణమి ఒక విశిష్టమైన పండుగ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పర్వదినం మన ప్రజల్లో సోదరభావాన్ని, ఐక్యతను చాటాలని ఆకాక్షించారు.