మరో హామీ నిలబెట్టుకున్న సీఎం జగన్‌

27 Jan, 2020 19:36 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నారు. వీఆర్‌ఏలకు వీఆర్‌ఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా జగన్‌ను కలిసిన వీఆర్‌ఏలు తమకు పదోన్నతి కల్పించాలని పలుమార్లు కోరిన విషయం తెలిసిందే. వారి వినతిపై స్పందించిన జగన్‌.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్లు కల్పిస్తామని అప్పట్లోనే వారికి హామీని ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎంగా ‍ప్రమాణం చేసిన ఎనిమిది నెలల్లోనే వీఆర్‌ఏలకు వీఆర్‌ఓలుగా పదోన్నతి కల్పించారు.

దీని ద్వారా వీఆర్‌ఏలకు ఇచ్చిన మాటాను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలు ఎదురుచూస్తున్న పదోన్నతిని సీఎం చేసి చూపించారు. నాలుగు వేల మంది గ్రామ సహాయకుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్‌ను గ్రామ సహాయకులు దేవుడిలా భావిస్తున్నారని, సీఎం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు