ఉచిత విద్యుత్‌ నిర్ణయం వరం

8 Nov, 2017 06:22 IST|Sakshi

కడప అగ్రికల్చర్‌: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం వేంపల్లెలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఈ హామీని అమలు చేస్తామని,  ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని చెప్పారు. జగన్‌ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌ ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాటతప్పిందని వారు  దుమ్మెత్తిపోస్తున్నారు.

అన్న వస్తే అంతా మేలు జరుగుతుంది
వైఎస్‌ జగనన్న ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పటికే ఆయన ప్రకటించిన నవరత్నాలు అందరి మన్నలను పొందాయి.  వేంపల్లెలో   రచ్చబండ సందర్భంగా ఆయన ఇచ్చిన ఉచిత కరెంటు హామీ తప్పకుండా అమలవుతుంది.
 – వినయ్‌కుమార్, ఎస్సీ కాలనీ, పులివెందుల  

ఎంతో మేలు జరుగుతుంది
ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇవ్వటం సంతోషంగా ఉంది. హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. జగన్‌ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ ఇవ్వటం వల్ల ఎస్సీలు బాగు పడతారు.
–ఎన్‌.పెంచలయ్య, మల్లేపల్లె, బ్రహ్మంగారిమఠం మండలం


సంతోషంగా ఉంది
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ వరం. గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ అందించారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పడం సంతోషకరం. దళితుల పక్షపాతి వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.
–మర్రి సుబ్బన్న, పెద్దచెప్పలి దళితవాడ, కమలాపురం మండలం

మరిన్ని వార్తలు