‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ ప్రారంభించనున్న జగన్‌

3 Oct, 2019 17:43 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, ఏలూరు: వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆటో, క్యాబ్‌, కారు డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమానికి ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. పాదయాత్రలో గతేడాది మే 14న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ఈ పథకాన్ని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో  సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకాన్ని సంతృప్తకర స్థాయిలో అమలు చేసేందుకు బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 312 కోట్లు ఇతర కులాలకు, రూ. 68 కోట్లు ఎస్సీలకు, రూ. 20 కోట్లు ఎస్టీలకు కేటాయించనుంది.

ముఖ్యాంశాలు
ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
మొత్తం దరఖాస్తులు: 1,75,352
ఆమోదించినవి: 1,73,102
తిరస్కరణకుగురైనవి: 2,250
ఆటోలు: 1,56,804
మ్యాక్సీ క్యాబ్‌లు: 5,093
ట్యాక్సీ క్యాబ్‌లు: 11,205

మరిన్ని వార్తలు