రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

8 Feb, 2019 20:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు (శనివారం) తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేయనున్నారు. పోలీసు ఆఫీసర్ల నియామాకాల్లో అధికార దుర్వినియోగంపై కూడా ఫిర్యాదులో పేర్కొననున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో లక్షల్లో నకిలీ ఓట్లను సృష్టించారని, ఇప్పటికే రకరకాల సర్వేల పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని, ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వర రావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ రావులను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్‌ అరోరాను ఢిల్లీలో వైఎస్‌ జగన్‌ కోరిన విషయం తెలిసిందే. 

(ఏపీలో లక్షల్లో నకిలీ ఓట్లు : వైఎస్‌ జగన్‌)

మరిన్ని వార్తలు