గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

2 Jan, 2020 16:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ దంపతులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, అయన సతీమణి భారతి సన్మానించి మెమొంటో అందించారు. గవర్నర్ కూడా సీఎం దంపతులను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్ధితులను గవర్నర్‌కు సీఎం జగన్ వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విశదీకరించారు. నూతనంగా శాసనసభ ఆమోదం పొందిన దిశ చట్టం గురించిన వివరాలను అందించారు. ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శులు అర్జునరావు, నాగమణి స్వాగతం పలికారు. సీఎం వెంట ముఖ్యమంత్రి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ తలశిల రఘురామ్, జీఎడీ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, అదనపు కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు