అంతులేని అభిమానం

28 Jan, 2018 07:40 IST|Sakshi

అడుగడుగునా జన నీరాజనం

కాండ్రలో పూలతివాచీ పరిచిన గ్రామస్తులు

ఓజిలి మండలంలో వైఎస్సార్‌ సీపీలో చేరిన టీడీపీ నేతలు

సాక్షిప్రతినిధి, నెల్లూరు: అంతులేని అభిమానం జననేతను అక్కున చేర్చుకుంది. పూలతివాచీ పరిచి.. మంగళ హారతులిచ్చి గ్రామాల్లోకి ఆత్మీయంగా స్వాగతించి ఆయన వెంట అడుగులు వేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంక ల్ప యాత్ర అశేష జనవాహిని నడుమ 72వ రోజైన శనివారం సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని ఓజిలి మండలం సగుటూరులో ప్రారంభమై గూడూరు నియోజకవర్గ పరిధిలోని తిమ్మసముద్రం క్రాస్‌ రోడ్డు వద్ద ముగిసింది. మొత్తం 14.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.  

ప్రారంభమైంది మొదలు..
ఉదయం 8 గంటలకు ఓజిలి మండలం సగుటూరులో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం కాగా.. ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయనతో ఆత్మీయ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా 2003–2015 మధ్య స్వర్ణ టోల్‌ప్లాజాలో పనిచేసిన 25మంది ఉద్యోగులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. తమను పర్మినెంట్‌ చేయకుండా ఇబ్బందులు పాల్జేసి ఉద్యోగాలనుంచి తొలగించారని.. 15 రోజులపాటు జైల్లో పెట్టించారని వాపోయారు. దీనివెనుక మంత్రి పి.నారాయణ, పారిశ్రామికవేత్త నానాజీ ఉన్నారని ఆరోపించారు. అధైర్యపడవద్దని జగన్‌ వారికి భరోసా ఇచ్చారు.

అనంతరం వాకాడు గ్రామానికి చెందిన పి.కోటేశ్వర్‌రెడ్డి అనే రైతు జననేతను కలిసి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.100 కోట్లతో వాకాడులో బ్యారేజ్‌ కట్టించారని, ఆయన మరణాంతరం సాగునీరిచ్చే పనులు నిలిచిపోయాయని వాపోయారు. బ్యారేజ్‌ వద్ద నీరు అందుబాటులో ఉంటే వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయని విన్నవించారు. గూడూరు శ్రీనివాసులు అనే వ్యక్తి 2016లో జరిగిన ప్రమాదంలో తన ఎడమ కాలు విరిగిపోయిందని తెలి పారు. దీనికి ఆరోగ్యశ్రీ  వర్తించదని వైద్యులు చెప్పడంతో దేవునికండ్రిగ గ్రామంలో తనకున్న అరెకరా భూమిని రూ.8 లక్షలకు విక్రయించి వైద్యం చేయిం చుకున్నా నయం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి చిల్లమాను చేను క్రాస్‌ రోడ్డుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌కు గ్రామస్తులు ఎదురెళ్లి స్వాగతం పలికారు.

 ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులు కలిసి తమ పాఠశాలకు ప్రహరీగోడ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. పాఠశాల వెనుకవైపున క్వారీ చెరువు ఉండటంతో ముగ్గురు విద్యార్థులు, ఒకరైతు అందులో పడి మృతి చెందారని విన్నవించారు. క్రాస్‌ రోడ్డు వద్ద పెద్దపరియ అంబరీష్‌రెడ్డి 200 మంది కార్యకర్తలతో కలిసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. అనంతరం గుర్రంకొండ చేరుకున్న జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగ తం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ పార్టీ జెం డాను ఎగురవేశారు.

 అక్కడ టీడీపీ నేత కొండూరు వామనరాజు కార్యకర్తలతో కలిసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. తరువాత ఆర్మేనుపాడుకు చేరుకున్న జననేతకు ఎస్సీ కాలనీ ప్రజలు స్వాగతం పలి కారు. గ్రామ సెంటర్‌లో జగన్‌తో ఆత్మీ య కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. అక్కడ మాజీ ఎంపీటీసీ, టీడీపీ నేత గుంటమడుగు రఘురామరాజు, పం డ్లూరు రవి నేతృత్వంలో 200మంది వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామ సెంటర్‌లో  వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి పతాకాన్ని ఎగురవేశారు.

కాండ్రలో పూల తివాచీ పరిచి..
గూడూరు నియోజకవర్గ పరిధిలోని కాండ్రలో పార్టీ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌కు పూలతివాచీ పరిచారు. కేరళ వాయిద్య విన్యాసాల నడుమ స్వాగతం పలికి సర్వమత ప్రార్థనలు చేశారు. ముస్లిం పెద్దలు జననేతకు టోపీ అలంకరించారు. పలువురు మహిళలు తమ సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తిమ్మసముద్రం చేరుకున్న వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అందరితో ఆత్మీయ కరచాలనం చేస్తూ పాదయత్ర కొనసాగించిన జననేత రాత్రి బసకు చేరుకున్నారు.

 కార్యక్రమాల్లో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీ వయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌కు రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రజా సంకల్ప యాత్ర కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళి, పార్టీ నేతలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ నాయకుడు చెంచు గరటయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు