జయహో జగన్‌

19 Sep, 2018 08:24 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆనందపురం ఆనంద పారవశ్యమైంది. ఆత్మీయత పంచింది. అభిమాన జల్లు కురిపించింది. కారుచీకటిలో కాంతిపుంజంలా దూసుకొస్తున్న సంకల్ప సూరీడు కోసం గుండెలోతుల్లోని అభిమానాన్ని కుమ్మరించింది. ప్రతి చేయి జననేత స్పర్శ కోసం తపించింది. ప్రతి నయనం ఆయన్ని తనివితీరా చూడాలని ఉవ్విళ్లూరింది. ప్రతి గుండె తమ కష్టాన్ని చెప్పుకోవాలని తహతహలాడింది.

బతికుండగానే నరకం చూపిస్తున్న తోడేళ్ల పాలనకు చరమ గీతం పాడేందుకు సమరశంఖం పూరిస్తూ ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజాసంకల్పయాత్ర భీమిలి నియోజక వర్గంలో ఉరిమే ఉత్సాహంతో కదంతొక్కుతోంది. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు ఎదురేగి స్వాగతం పలుకుతున్నా రు. జయహో జగన్‌ అంటూ నినదిస్తున్నారు. చెరగని చిరునవ్వు..సడలని సంకల్పంతో 265వ రోజు ప్రజాసంకల్పయాత్ర మంగళవారం ఉదయం 8.55 గంటలకు ఆనందపురం నుంచి ప్రారంభమైంది.

 భీమిలి కో ఆర్డినేటర్‌ అక్కరమాని విజయనిర్మల, పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావు, విశాఖ, అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్‌నా«థ్, పార్లమెంటు కో ఆర్డినేటర్లు ఎంవీవీ సత్యనారాయణ, వరుదు కళ్యాణి తదితర నేతలు వెంట రాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నేల్తేరు, పాల వలస, సీతంపాలెం, జగ్గరాజుపాలెం క్రాస్, పందలపాక ఎస్సీ కాలనీ, పందలపాక యాతపేట, తర్లువాడ క్రాస్, గొంపవానిపాలెం, బాకురుపాలెం క్రాస్, ఇచ్చాపురం క్రాస్‌ మీదుగా ముచ్చెర్ల క్రాస్‌ వరకు 9.6 కిలోమీటర్ల మేర సాగింది. 

దారిపొడవునా సమస్యల వెల్లువ
పాదయాత్రలో దారిపొడపునా బారులుతీరిన ప్రజలు జననేతకు తమ కష్టాలను చెప్పుకున్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో టీడీపీ పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని దివ్యాంగులు ఆనందపురం ఎస్సీ కాలనీ వద్ద జననేతను కలిసి మొరపెట్టుకున్నారు. ఇండో టిబెటిన్‌ క్యాంప్‌ కోసం సేకరించిన భూములకు పరిహారం ఇవ్వలేదని బాధితులు జగన్‌ దృష్టికితీసుకొచ్చారు. సినీ నటుడు ఫిష్‌ వెంకట్‌ పందలపాక వద్ద జగన్‌తో కలిసి అడుగులు వేశారు.తమ గ్రామంలో ఎలాంటి సదుపాయాలు లేవని గొంపవానిపాలెం గ్రామస్తులు జగన్‌కు మొరపెట్టుకున్నారు. తమ మనుమరాలు ధవల లక్ష్మి సహస్ర పుట్టిన రోజు సందర్భంగా జననేత సమక్షంలో కేక్‌ కట్‌ చేసి పుట్టిన రోజు వేడుకను జరుపుకుంది.

పాదయాత్ర టూర్‌ ప్రొగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, గుంటూరు పార్లమెంట్‌ జిల్లా సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు తాడి విజయభాస్కరరెడ్డి, గోలి శరత్‌రెడ్డి, ఆర్‌.వెంకట సుబ్బారెడ్డి,  సిఇసి సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, సమన్వయకర్తలు వి.సాయిరాజు, రిటైర్డ్‌ విజిలెన్స్‌ ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు, ఏటికొప్పాక సుగర్‌ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.రామభద్రరాజు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ సత్తి రామకృష్ణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఉప్పలపాటి సుకుమార్‌ వర్మ, వడ్డి లలిత్‌కుమార్, కాకర్లపూడి వరహాలరాజు, చందక బంగారునాయుడు, చొక్కాకుల వెంకటరావు, ఎస్సీసెల్‌ నగర అధ్యక్షుడు బోని శివరామకృష్ణ,  రెయ్యి వెంకటరమణ, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, బంక సత్యం, కంటుబోతు రాంబాబు, మజ్జి వెంకటరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌.కరుణాకరరెడ్డి, జిల్లా కార్యదర్శులు అక్కరమాని మంగరాజు, కదిరి ఎల్లాజీ, వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి మాజీ ఎంపీపీ శివకుమార్, వీర ప్రతాపరెడ్డి, పి.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ఆనందపురం మాజీ ఎంపీపీ కోరాడ వెంకటరావు, హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరామిరెడ్డి, ఏటికొప్పాక నుంచి అన్నం వెంకటరావు, అన్నం నాగేంద్ర, నీటిపల్లి లక్ష్మి, మర్రిపల్లి శోభ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు