గంటన్నర ఇవ్వటమే గొప్ప అన్నట్లుగా...

27 Aug, 2014 14:15 IST|Sakshi
గంటన్నర ఇవ్వటమే గొప్ప అన్నట్లుగా...

హైదరాబాద్ : సభ ఇదే తీరుగా పని చేస్తే.. తమకు నిరసన వ్యక్తం చేయడం మినహా మరో మార్గం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. తాము మాట్లాడతామని పదే పదే కోరుతున్నా.. అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆక్షేపించారు. బడ్జెట్ కేటాయింపులపై వాస్తవాలు ప్రజలకు తెలిసేందుకే తాము మాట్లాడదల్చామని.. అయినా మైక్ ఇవ్వడం లేదని.. ఇలా అయితే నిరసన వ్యక్తం చేయడం మినహా మరో మార్గం లేదని జగన్ అన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా  చంద్రబాబు నాయుడు బడ్జెట్పై ఎన్ని గంటలు మాట్లాడారో రికార్డులు తిరగేయాలని ఆయన సూచించారు.

గత పదేళ్లలో బడ్జెట్ మీద ప్రతిపక్ష నేతలు బడ్జెట్ మీద చర్చపై ఎంత సమయం తీసుకున్నారో పరిగణనలోకి తీసుకోవాలని జగన్ అన్నారు. ఉన్నది ఒక్క ప్రతిపక్ష పార్టీయేనని... ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్టం లేదని, గంటన్నర సమయం ఇవ్వటమే గొప్ప అన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా అయితే తమకు నిరసన మినహా మరో మార్గం లేదన్నారు.

 

బడ్జెట్‌పై చర్చలో తనకు మరింత సమయం కావాలని జగన్ పట్టుబట్టారు. అయితే స్పీకర్‌ మాత్రం సమయం కేటాయించడానికి అనుమతించకపోవడంతో సభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి సభనుంచి వాకౌట్‌ చేసింది. కేవలం గంటన్నర సమయం మాత్రమే ఇవ్వడంపై నిరసన తెలిపింది.

మరిన్ని వార్తలు