అవినీతి ఉండకూడదు: సీఎం జగన్‌

25 Feb, 2020 15:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపడానికి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రచార వీడియోలను ఆయన మంగళవారం విడుదల చేశారు. సీఎం జగన్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సందేశంతో ఈ వీడియోలను తయారుచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోను అవినీతి ఉండకూడని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అవినీతిని ఏరివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. (ఎవరికీ అన్యాయం జరగకూడదు: సీఎం జగన్‌)

వారిద్దరికీ అభినందనలు: సీఎం జగన్‌
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకోనున్న బండి నారాయణస్వామి, పి. సత్యవతి (అనువాద విభాగం)లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఇరువురు విశేషమైన సేవలను అందించారని ప్రశంసించారు. రాష్ట్రం నుంచి ఇద్దరు రచయితలను ఈ అవార్డులు వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. (నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం) 

చదవండి: (ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ)

మరిన్ని వార్తలు