విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం జగన్‌ సమీక్ష

10 May, 2020 19:16 IST|Sakshi

సాక్షి, అమరావతి : విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆదివారం తన నివాసంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కంపెనీలో గ్యాస్‌ లీకేజీని అరికట్టడానికి తీసుకున్న చర్యలను, కంపెనీ సమీప గ్రామాల్లో స్టెరెన్‌ గ్యాస్‌ అవశేషాల తొలగింపునకు చేపడుతున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ముమ్మరంగా శానిటైజేషన్‌ జరపాలని.. అన్నిరకాల చర్యలను తీసుకున్న తర్వాతనే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని..  ఈ రోజు మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని.. రేపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  ( విదేశాల నుంచి వ‌చ్చేవారి వివ‌రాలు న‌మోదు )

మిగిలిన వారికి కూడా ప్రకటించిన విధంగా సహాయం అందించడానికి తగినన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాధితులు కోలుకుంటున్న వైనం, వారికి చికిత్స అందుతున్న తీరును అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు నివేదించారు. గాలిలో గ్యాస్‌ పరిమాణం రక్షిత స్థాయికి చేరిందని తెలిపారు. దీనిపై నిపుణులు పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నారని వివరించారు. ( వారి ప్రయోజనాలు కాపాడండి: సీఎం జగన్ )

>
మరిన్ని వార్తలు