బాగోతం బయటపడుతుందనే బాబు భయపడుతున్నారు : వైఎస్‌ జగన్‌

7 Oct, 2018 17:55 IST|Sakshi

ఐటీ దాడులపై చంద్రబాబుకు అంత భయమెందుకు

అక్రమ సంపాదన బయటపడుతుందనే ఉలిక్కిపడుతున్నారు

ప్రజాసంకల్పయాత్ర గుర్ల బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

సాక్షి, విజయనగరం/ గుర్ల : అక్రమంగా సంపాదించిన సొమ్మును ఐటీ అధికారులు ఎక్కడ స్వాధీనం చేసుకుంటారోనని చంద్రబాబునాయుడు భయపడుతున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్ర 280వ రోజు పాదయాత్రలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఎన్నికల సమీపిస్తున్నందును ప్రతీ నియోజవర్గానికి రూ. 30 కోట్లు తరలించారని, వాటి వివరాలు బయటపడుతాయనే చంద్రబాబు భయాందోళనకు గురవుతున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని, ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయని ఐటీ అధికారులు ప్రశ్నిస్తారనే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో అనేకసార్లు ఐటీ దాడులు జరిగినా స్పందించని సీఎం ఇప్పుడెందుకు గిలగిల కొట్టుకుంటున్నారని ప్రశ్నించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రాంలో ఎక్కడ చూసినా అవినీతి తప్పు ఏమీ లేదని మండిపడ్డారు. జిల్లాకు తలమానికంగా ఉన్న తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు అటకెక్కించారని,  వైఎస్సార్‌ హాయాంలో ఈ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో మిగిలిన 10 శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు.

సమావేశంలో వైఎస్‌ జగన్ మాట్లాడుతూ.. ‘‘ చంద్రబాబు సీఎం అయ్యాకా జిల్లాలో జూట్‌ మిల్లులు మూతపడుతున్నాయి. విజయనగరంలో 16 మిల్లులు ఉంటే నాలుగేళ్ల కాలంలో 6 మిల్లులు మూతపడ్డాయి. కరెంట్‌ చార్జీలు అధికంగా పెంచడం వల్లనే అవి మూతపడుతున్నాయి. వాటి వల్ల ఉద్యోగాలు కోల్పోవలసి వస్తోంది. అగ్రిగోల్డ్  మోసంలో అత్యధికంగా నష్టపోయింది ఉత్తరాంద్ర ప్రజలే. రాష్ట్రంలో 18 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వారందరి ఇప్పటి వరకూ నష్టపరిహారం చెల్లించలేదు. 11 వందల కోట్లు కేటాయిస్తే వారందరిని ఆదుకోవచ్చు. చంద్రబాబు ఎందుకు వారిని ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు’’

కంప్యూటర్‌తో కూడా అబద్ధాలు చెప్పిస్తారు..
‘‘11 వందల కోట్లు కేటాయిస్తే వారందరిని ఆదుకోవచ్చు. చంద్రబాబు ఎందుకు వారిని ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పారాడా అంటూ చంద్రబాబు ప్రతీసారి అక్కడకు వెళ్తారు. కానీ ఆయన అక్కడ చేసే బాగోతం మాత్రం.. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ రేటుకు వేలం వేయడానికి బ్రోకరింగ్‌ చేయడానకి అమర్‌సింగ్ అనే వ్యక్తితో మంతనాలు చేస్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు 11 వందలు కేటాయించి వారిని ఆదుకుంటాం. నాలుగేళ్లలో రాష్ట్రంలో పాలన కుంటుపడింది. గతంలో వైఎస్‌ హాయంలో జిల్లాలో 38 వేల ఇళ్లు నిర్మిస్తే.. నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు ఊరికి కనీసం ఒక్క ఇళ్లు కూడానిర్మించలేక పోయారు.150 కోట్లతో వైఎస్‌ త్రాగునీరు అందించారు. చంద్రబాబు పేదలకే ఏమీ చేయలేక కేవలం అబద్దాలతోనే నడిపిస్తున్నారు’’ అని అన్నారు.

అందరూ గోబెల్స్‌యే..
‘‘కేవలం గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. హిట్లర్‌ మంత్రి వర్గంలో ఒకే ఒక గోబెల్ ఉంటే చంద్రబాబు మంత్రివర్గంలో అందరూ గోబెల్స్‌యే. కంప్యూటర్‌తో అబద్దాలు చెప్పించగలడు. దానికి తోడు ఎల్లో మీడియా ప్రచారం. చంద్రబాబు నాయుడు ఎదనుకుంటే దానినే ప్రచారం చేస్తున్నారు.  గతంలో బీజేపీకి జై అంటే ఎల్లో మీడియా కూడా అదే అంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు జై అంటే మీడియా కూడా కాంగ్రెస్‌కు జై అంటోంది. సీ ఓటర్‌ అనే ఓ సంస్థ చేసిన సర్వేలో వైఎస్సార్‌సీపీకి 21 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చిచెప్పింది. కానీ కొన్ని పత్రికలు మాత్రం వాటికి భిన్నంగా వార్తలు రాశారు. రాష్ర్టంలో జరిగే అవినీతి మీద మాత్రం ఒక్క వార్త కూడా రాయరు. పోలవరం, ఇసుక మాఫీయా, మట్టిమాఫీయా మీద మాత్రం రాయలేరు. కరెంటు చార్జీలు, ఫీజులు, ఆసుపత్రి చార్జీలు విఫరీతంగా పెంచారు. పేదవాడు ఆసుపత్రికి పోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతోంది’’ అని వ్యాఖ్యానించారు.


 

మరిన్ని వార్తలు