ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు

13 Oct, 2019 09:48 IST|Sakshi
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి

ముఖ్యమంత్రి సభకు 50 వేల మంది వస్తారని అంచనా  

సాక్షి, వెంకటాచలం(నెల్లూరు) : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ)లో సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబుతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. సభా వేదికను పరిశీలించిన తరువాత వీఎస్‌యూ సెమినార్‌ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించనుండటంతో ఆ పథకం లబ్ధిదారులు, వలంటీర్లు సభకు తరలివచ్చేలా చూడాలని అధికారులకు సూచించామని కలెక్టర్‌ శేషగిరిబాబు చెప్పారు. సభావేదిక వద్ద ఏర్పాట్లను అధికార సిబ్బందితో త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు.

అనంతరం ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతాంగం ఎక్కువగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడం రైతులకు గర్వకారణమన్నారు. నవరత్నాలలో ప్రతిష్టాత్మకమైన రైతు భరోసాను నెల్లూరు నుంచే ప్రారంభించాలనుకోవడం జిల్లాపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న అభిమానాన్ని చాటిచెప్పుతుందన్నారు. రైతులు, ప్రజలు అంతా కలిసి 50 వేలమందికి పైగా రైతు భరోసా కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా చిన్నపొరపాట్లు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. అధికారయంత్రాంగం, జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ సమష్టి కృషితో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

రైతులు, ప్రజలు సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వానికి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. రబీ సీజన్‌కు ముందు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్, డీఆర్‌డీఏ పీడీ శీనానాయక్, వీఎస్‌యూ రిజిస్ట్రార్‌ అందె ప్రసాద్, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలుకుదాం సభ్యుడు మందల వెంకటశేషయ్య  పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా