8న సీఎం పులివెందుల పర్యటన

6 Aug, 2019 07:26 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరి కిరణ్‌

8న సీఎం పులివెందుల పర్యటన

రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు

సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8వ తేది పులివెందులలో పర్యటించనున్నారని కలెక్టర్‌ హరి కిరణ్‌ తెలిపారు. సోమవారం స్పందన కార్యక్రమ సందర్బంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పులివెందుల ఏరియా అభివృద్ది కోసం ప్రభుత్వం రూ.100 కోట్లతో వివిధ పనులు చేపట్టనుందన్నారు. పులివెం దుల అభివృద్దికి సంబంధించి అధికారులు నోట్స్‌ తయారు చేసి వెంటనే తమకు అందజేయాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా వివిధ శాఖలు శకటాలు,  ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈనెల 9వ తేది సాయంత్రం 5.00 గంటల్లోపు జిల్లా రెవెన్యూ అధికారికి ఉద్యోగుల జాబితాను ఇవ్వాలన్నారు.

వివిద శాఖల్లో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పూర్తి సమాచారాన్ని ఈనెల 6వ తేదిన సాయంత్రం 6.00 గంటల్లోపు పౌరసంబంధాలశాఖ ఏడీ కార్యాలయానికి పంపాలన్నారు. గ్రామ వలంటీర్ల ఎంపిక పూర్తి కావడంతో ఈనెల 6, 7, 8, 9 తేదీలలో ఎంపీడీఓల ఆధ్వర్యంలో  శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజా సాధికార సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఉండే విధంగా స్పెషల్‌ ఆఫీసర్లు వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ–ఆఫీసులో జిల్లా మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి దిగజారిందన్నారు. ఈ–ఆఫీ సు పాలన మెరుగు పరచాలని చెప్పారు. స్పందన కార్యక్రమానికి సంబంధించి బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ అర్జీల పరిష్కారం తగ్గిందని, విత్‌ ఇన్‌ ఎస్‌ఎల్‌ఏ కూడా తగ్గిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శివారెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్, స్పెషల్‌ కలెక్టర్‌ సతీష్‌ చంద్ర, ఐసీడీఎస్‌ పీడీ పద్మజ, కేఆర్‌ఆర్‌సీ డెప్యూటీ కలెక్టర్‌ మధుసూదన్‌రావు, ఎస్‌ఎస్‌ఏ పీఓ సుజన, ఇతర జిల్లా అదికారులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు